News December 16, 2025

హైదరాబాద్ BDLలో 80 పోస్టులు

image

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌(BDL)లో 80 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc(కెమిస్ట్రీ), MBA, CA/ICWAI, PG డిప్లొమా, M.Com ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.1,40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్:bdl-india.in

Similar News

News December 16, 2025

మోదీ గొప్ప స్నేహితుడు: ట్రంప్

image

భారత్‌తో పాటు ప్రధాని మోదీపై US అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఇండియా ఒకటి. ఇది అద్భుత దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. మనకు PM మోదీ అనే గొప్ప స్నేహితుడు ఉన్నారు’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఇండియాలోని US ఎంబసీ ట్వీట్ చేసింది. ద్వైపాక్షిక ట్రేడ్ డీల్ కోసం అమెరికా బృందం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

News December 16, 2025

‘సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష’లో ముఖ్యమైన అంశాలు ఇవే!

image

2047కు ఇన్సూరెన్స్ రంగ అభివృద్ధి టార్గెట్‌గా సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష (ఇన్సూరెన్స్ Laws అమెండ్‌మెంట్ బిల్-2025)ను కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. FDIల పరిమితి 74%-100%కి పెంపు, ఛైర్మన్, MD, CEOలలో ఒకరు ఇండియన్ సిటిజన్, సైబర్, ప్రాపర్టీ రంగాలకు లైసెన్సులు, ఇన్సూరెన్స్, నాన్-ఇన్సూరెన్స్ కంపెనీ మెర్జర్లకు అనుమతి, పాలసీ హోల్డర్ రక్షణకు ప్రత్యేక ఫండ్ వంటి మార్పులు బిల్‌లో పొందుపరిచింది.

News December 16, 2025

నిద్రలేమితో ఆయుష్షు తగ్గే ప్రమాదం

image

తగినంత నిద్ర లేకపోతే ఆయుష్షు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. USకు చెందిన ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ (OHSU) చేసిన ఈ పరిశోధన ప్రకారం రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. స్మోకింగ్ తర్వాత జీవితకాలాన్ని ఎక్కువగా తగ్గించే అంశం ఇదేనని, తక్కువగా నిద్రపోవడం వలన రోగనిరోధక శక్తి, మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరించారు.