News June 16, 2024

హైదరాబాద్‌ CCSలో 12 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

image

హైదరాబాద్‌ CCSలో‌ భారీగా బదిలీలు జరిగాయి. ఏకంగా 12 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీ జోన్-2కు బదిలీ చేస్తూ CP శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రిపోర్ట్‌ చేయాలని‌ అందులో పేర్కొన్నారు. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల వివరాలు: శివ శంకర్, రఘుబాబు, అప్పలనాయుడు, భూక్య రాజేశ్, సీత రాములు, హుస్సేన్ ధీరావత్, సత్యం, నాగేశ్వర్ రెడ్డి, ధీరావత్ కృష్ణ, కొత్త సత్యనారాయణ, SA ఇమన్యూల్, బిట్టు క్రాంతికుమార్‌.

Similar News

News September 22, 2024

HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల తేదీలు ఖరారు!

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.

News September 22, 2024

HYD: ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూ పార్క్!

image

HYD శివారు ఫోర్త్ సిటీ ఏరియాలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 2 రోజుల క్రితం అటవీశాఖ బృందం గుజరాత్ జామ్‌నగర్ ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అధ్యయనం చేసింది. ఫోర్త్ సీటీ చుట్టూర దాదాపు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో 200 ఎకరాల్లో జూ పార్కుతో పాటు, 1000 ఎకరాల ప్రాంతాన్ని గ్రీన్ బెల్టుగా చూపాలని ప్రభుత్వం భావిస్తోంది.

News September 22, 2024

28న నల్సార్ యూనివర్సిటీకి రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.