News August 9, 2024
హైదరాబాద్: HMDAలో కొత్త జోన్లు

HMDAలో కొత్తగా 2 జోన్లు పెంచారు. ఇప్పటివరకు ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్‌పల్లి HMDA పరిధిలో ఉండేవి. ఇకమీదట ఘట్‌కేసర్, శంషాబాద్‌తో పాటు మేడ్చల్-1, మేడ్చల్-2, శంకర్‌పల్లి-1, శంకర్‌పల్లి-2 అని రెండు జోన్లుగా విభజించారు. శంకర్‌పల్లి జోన్-1కు ప్రసాద్ రావు, శంకర్‌పల్లి-2కు మల్లికార్జునరావుకు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్-1కు గోపిక రమ్య, మేడ్చల్-2కు శాలినికి ప్లానింగ్ అధికారిగా నియమించారు.
Similar News
News February 16, 2026
HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్‌లో 10, HYD స్కార్ట్ డివిజన్‌లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్‌లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.
News February 16, 2026
HYD: నిరుద్యోగులకు GOOD NEWS

HYDలోని కేంద్రీయ విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతో పాటు (CTET) అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
News February 16, 2026
HYD: మార్మోగిన శివతత్వం..‘ఉత్తర-దక్షిణ’ సంగీత విందు

రవీంద్రభారతి వేదికగా ఆదివారం రాత్రి సంగీత ప్రియులకు శ్రవణానందం కలిగింది. సూర్మండల్ సంస్థ 15వ ‘ఉత్తర-దక్షిణ’ కచేరీని అట్టహాసంగా నిర్వహించింది. పండిత్ జయతీర్థ్ మేవుండి హిందుస్థానీ గాత్రం, విద్వాన్ శశాంక్ కర్ణాటక వేణుగానం కలిసి అద్భుతమైన జుగల్బందీని పండించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వారు ఆలపించిన ‘శంభో శివ శంభో’ కీర్తనకు సంగీత ప్రియులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.


