News October 13, 2024
హైదరాబాద్: PHOTO OF THE DAY

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను ఏకం చేసిన గొప్ప కార్యక్రమం అలయ్ బలయ్ అని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ హరియాణా గవర్నర్ బండారు దత్రాత్రేయ ఆలింగనం చేసుకున్నారు. అయితే, ఒకే వేదిక మీద రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, HYD BRS MLAలు ఉండడంతో PHOTO OF THE DAYగా నిలిచింది. అలయ్.. బలయ్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొంది.
Similar News
News November 3, 2025
HYD: బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
News November 3, 2025
మీర్జాగూడ ప్రమాదం.. కండక్టర్ సేఫ్

మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు డ్రైవర్ దస్తగిరి బాబు చనిపోయాడు. కండక్టర్ రాధ గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, తాండూరు MLA బుయ్యని మనోహర్, MLC పట్నం మహేందర్ పరామర్శించారు. మిగతా క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News November 3, 2025
HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.


