News June 16, 2024
హైదరాబాద్: SBI ఏటీఎంలో పాము
SBI ఏటీఎంలోకి పాము చొరబడిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో జరిగింది. స్థానికుల వివరాలు.. హయత్ నగర్ బొమ్మల గుడి ఎస్బీఐ ఏటీఎంలోకి పాము చొరబడింది. దీంతో ఏటీఎం సెంటర్‌లోకి డబ్బులను డ్రా చేసుకునేందుకు వచ్చిన కస్టమర్లు పామును చూసి భయాందోళన చెందారు. వెంటనే సిబ్బందికి తెలిపి అనంతరం స్నేక్ స్నాచర్‌కు సమాచారం అందించారు.
Similar News
News January 16, 2025
సికింద్రాబాద్‌లో ముగిసిన కైట్ ఫెస్టివల్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ బుధవారంతో ముగిసింది. 50 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. సూపర్ హీరోలతో పాటు భారీ ఆకారంలో స్నేక్, గాడ్జిల్లా, వివిధ రకాల బొమ్మలు, హైదరాబాద్ మెట్రో సంస్థ(L&T)కు చెందిన ట్రైయిన్ కైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది పరేడ్ గ్రౌండ్‌లో సంక్రాంతి సందర్భంగా ఎంజాయ్ చేశారు.
News January 15, 2025
జార్జ్ రెడ్డి: ఈ పేరు HYDలో యాదుంటది!
‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి పేరు ఎప్పటికీ యాదుంటది. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1947, JAN 15న జార్జ్ జన్మించారు. 1962లో ఆయన ఫ్యామిలీ HYDలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్ OUలో పీజీ చేశారు. వర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే హత్యచేశారు. నేడు జార్జ్ జయంతి.
News January 15, 2025
త్వరలో OUలో ఇంజినీరింగ్ కోర్సులు
ఉన్నత విద్యా మండలి, అఖిలభారత సాంకేతిక విద్యా మండలి ఆమోదంతో త్వరలో ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు అందుబాటులోకి తీసుకురానున్నామని ఓయూ అధికారులు తెలిపారు. ఉపాధి కల్పన, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు కల్పించేలా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు డిగ్రీ కోర్సుల్లో ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థల తరహాలో పాఠ్యాంశాలను రూపొందించనున్నాయి.