News January 31, 2025

హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి తెలిపారు. ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాట్ల కోసం భూ సేకరణకు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 28, 2026

VKB: జిల్లాలో 78 మంది విద్యార్థుల ఎంపిక

image

వికారాబాద్ జిల్లాలో నేషనల్ మిన్స్ కం మెరిట్స్(NMMS) స్కాలర్షిప్‌నకు 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పరీక్షకు 1,097 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 78 మంది ఎంపికయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ప్రభుత్వం స్కాలర్షిప్స్ అందించనుంది. విద్యార్థులకు సంబంధించిన అన్ని అర్హత ధ్రువీకరణ పత్రాలను ఉన్నతాధికారులకు పంపించేందుకు జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టారు.

News February 28, 2026

కసాయి తల్లి.. కన్నబిడ్డనే చెత్తకుప్పలో పడేసింది!

image

సత్యసాయి జిల్లా: కన్నప్రేమ కరువైందో లేక కనికరం చచ్చిందో కానీ, సోమందేపల్లి మండలం నడింపల్లిలో ఒక పసికందు పురిటిలోనే అనాథగా మారింది. నవమాసాలు మోసి, రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చే అమ్మే ఆ పసి ప్రాణాన్ని చెత్తదిబ్బలో పడేసింది. శనివారం ఆ చిన్నారి ఏడుపు విని గ్రామస్థులు పరుగున వెళ్లి చూశారు. ప్రస్తుతం ఆ చిన్నారి హిందూపురం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

News February 28, 2026

పార్టీ ఏర్పాటుకు ముందు క్లీన్‌చిట్.. ఇక దూకుడేనా?

image

TG: లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో జాగృతి చీఫ్ కవిత దూకుడు పెంచే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాటుకు ముందు నిర్దోషిగా తేలడం ఆమెకు సానుకూల అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు BRS నుంచి మద్దతు లభించలేదని కవిత పలుమార్లు వాపోయారు. పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత ‘లిక్కర్ క్వీన్’ అంటూ పలువురు BRS శ్రేణులు ఆమెను విమర్శించాయి. మరి ఇప్పుడు వారు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.