News June 16, 2024

హోంశాఖ, పాయకరావుపేట రెండుకళ్లు: అనిత

image

హోంశాఖ, పాయకరావుపేటను రెండుకళ్లుగా భావిస్తూ సమ ప్రాధాన్యత ఇస్తానని మంత్రి అనిత అన్నారు. వారంలో 3 రోజులు నియోజకవర్గంలోనే ఉంటానని, మిగతా రోజులు హోంశాఖకు కేటాయిస్తానన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించి, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా పేటను మార్చుతానన్నారు. ప్రజలకు పోలీసులను దగ్గర చేస్తానని, దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్‌ని అరికడతామన్నారు.

Similar News

News November 6, 2025

‘గూగుల్ సెంటర్‌తో వందల సంఖ్యలోనే ఉద్యోగాలొస్తాయి’

image

విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తే లక్షల్లో ఉద్యోగాలు రావని, వందల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింత మోహన్ అన్నారు. సుందర్ పిచాయ్ పేదవాడు కాదని అపర కోటీశ్వరుడన్నారు. 500 ఎకరాలు ఇచ్చి భూములతో వ్యాపారం చేయడం చంద్రబాబుకు పిచాయ్‌కి మధ్య ఉన్న బంధం ఏంటో వెల్లడించాలన్నారు. ఈనెల 31లోపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదని కేంద్రం ప్రకటన చేయలన్నారు.

News November 6, 2025

విశాఖ: మహిళలను కాపాడిన లైఫ్ గార్డ్స్

image

RK బీచ్ గోకుల్ పార్క్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళలను లైఫ్ గార్డ్స్ కాపాడారు. గురువారం ఉదయం మహారాణి పేటకు చెందిన కీర్తి ఉషారాణి, సునీత పూజా సామాగ్రిని సముద్రంలో వదలడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కెరటాల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోతుండగా లైఫ్ గార్డ్స్ గమనించి వారిని రక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

News November 6, 2025

విశాఖ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ!

image

విశాఖ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. స్టాంప్‌ పేపర్‌ లైసెన్స్‌ వెండర్లు, డాక్యుమెంట్‌ రైటర్లుగా తిష్ట వేసి ప్రజలను పీడిస్తున్నారు. పన్నులు, ఫీజులు, TDS చెల్లించినా ఆస్తి విలువను బట్టి 1% వరకు వారికి అదనంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చలానాలు, ఫీజులు నేరుగా చెల్లించే అవకాశం లేకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటారు. దళారీ వ్యవస్థను పెకిలించాలని కోరుతున్నారు.