News December 19, 2025

హోం క్లీనింగ్ టిప్స్

image

* ​​​​​​​కిటికీ అద్దాలు, డ్రస్సింగ్‌ టేబుల్‌ మిర్రర్‌ కొన్నిసార్లు మబ్బుగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఫిల్టర్‌ పేపర్‌తో శుభ్రం చేస్తే అవి తళతళా మెరిసిపోతాయి. * మార్కర్‌ మరకల్ని తొలగించాలంటే ఆయా ప్రదేశాల్లో కాస్త సన్‌స్క్రీన్‌ అప్లై చేసి అరగంట తర్వాత పొడి క్లాత్‌తో తుడిస్తే చాలు. * గాజు వస్తువులు పగిలినప్పుడు, చీపురుతో శుభ్రం చేశాక బ్రెడ్‌ ముక్కతో నేలపై అద్దితే చిన్న ముక్కలన్నీ శుభ్రమవుతాయి.

Similar News

News December 22, 2025

మన టాప్-4 కంపెనీల విలువ కంటే మస్క్ సంపదే ఎక్కువ

image

ఎలాన్ మస్క్ సంపద ఫోర్బ్స్ ప్రకారం 748 బి.డాలర్లకు చేరింది. రిచ్ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న లారీ పేజ్ కంటే ఆయన సంపద 496 బి.డాలర్లు ఎక్కువ. అలాగే ఇండియాలో మార్కెట్ క్యాప్ పరంగా టాప్-4లో ఉన్న రిలయన్స్, HDFC, Airtel, TCS విలువ కంటే కూడా మస్క్ సంపదే అధికం. ఇటీవల అక్కడి కోర్టు మస్క్‌కు రావాల్సిన టెస్లా స్టాక్ ఆప్షన్లు, వేతన ప్యాకేజీని పునరుద్ధరించడంతో ఆయన సంపద భారీగా పెరిగింది.

News December 22, 2025

యూనస్ నాయకత్వం ‘బంగ్లా’కు ప్రమాదకరం: షేక్‌ హసీనా

image

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా స్పందించారు. యూనస్ నాయకత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. మైనారిటీలపై పెరుగుతున్న దాడులు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, భారత్‌ సహా పొరుగు దేశాలతో సంబంధాలకు ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. తీవ్రవాద శక్తులకు యూనస్ ప్రభుత్వం అవకాశం ఇస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

News December 22, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* పంచదార డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే పేపర్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* పెనాన్ని రెండు గంటలపాటు వేడినీటిలో ఉంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దితే జిడ్డు వదిలి పోతుంది.
* గారెలు, బూరెలు వంటివి చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలంటే నూనెలో కాస్త నెయ్యి వేస్తే సరిపోతుంది.