News July 18, 2024

హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసిన మదన్

image

గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కేంద్రంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన భార్యకు శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఆమె భర్త మదన్ కమిషనర్‌కు రాసిన లేఖ బట్టబయలు కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. తాజాగా గురువారం రాత్రి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను మదన్ కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమెకు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 9, 2025

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్‌ రద్దు

image

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలలో, భద్రత చర్యలలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేసామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సీపీ కోరారు. అలాగే జీవీఎంసీలో కూడా రేపు పీజీఆర్ఎస్‌ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

News November 9, 2025

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే PGRS రద్దు

image

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.

News November 9, 2025

భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.