News December 24, 2025

హోటల్‌గా రుషికొండ ప్యాలెస్.. 28న నిర్ణయం?

image

AP: రుషికొండ ప్యాలెస్‌ను హోటల్‌గా మార్చే అవకాశం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ఇందుకు తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రులు కేశవ్, దుర్గేశ్ వెల్లడించారు. ‘మాల్దీవ్, పుదుచ్చేరి బీచ్ హోటల్స్‌పై చర్చించాం. ప్రజలకు పనికొచ్చేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా వినియోగిస్తాం. గత ప్రభుత్వ నిర్ణయంతో నెలకు ₹25L భారం పడుతోంది’ అని చెప్పారు. ఈ 28న మరోసారి చర్చిస్తామన్నారు.

Similar News

News December 28, 2025

దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు!

image

బంగ్లాలో దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపూపై తప్పుడు నిందలు వేసి కొట్టి చంపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు NDTVతో చెప్పారు. మృతదేహాన్ని కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారన్నారు. అసలు దీపూ ఏ మతాన్నీ విమర్శించలేదని అధికారులు తేల్చినట్లు చెప్పారు. హిందువు అనే కారణంతో, ఎదుగుతున్నాడనే అసూయతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారన్నారు.

News December 28, 2025

చలి మంట.. పసిపిల్లలు మృతి

image

చలి కాచుకోవడానికి గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ఊపిరాడక చనిపోయిన ఘటన బిహార్‌లోని ఛాప్రాలో జరిగింది. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ గదిని నింపేసింది. దీంతో ఆ గాలి పీల్చి వారు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తేల్చారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

News December 28, 2025

ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

ప్రెగ్నెన్సీలో మహిళలు తరచుగా నీరసంగా, అలసిపోయినట్లు కనిపిస్తారు. అయితే ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగడం మంచిది కాదందటున్నారు నిపుణులు. అలసట, తలతిరగడం, కండరాల నొప్పి, బలహీనత, చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ సమస్యలను తగ్గించడానికి గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, గింజలు, రేగుపండ్లు తినాలని చెబుతున్నారు.