News November 19, 2025

హోటల్‌ రూమ్‌లకు భలే డిమాండ్‌

image

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తుండటంతో పుట్టపర్తిలో లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. రూ.5 వేలు పెట్టినా రూములు దొరకడం లేదు. అయితే, ట్రస్ట్ తరఫున 50 వేల మందికి సరిపడేలా వసతి షెడ్లు ఏర్పాటు చేసి, మూడు పూటలా భోజన సౌకర్యం కల్పించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉతచి బస్సులు ఏర్పాటు చేశారు. దేవభూమి ఆధ్యాత్మక శోభతో వెలుగొందుతోంది.

Similar News

News April 13, 2026

ఖమ్మం: మాతృ-శిశు మరణాల తగ్గింపుపై కలెక్టర్ ఆదేశాలు

image

ఖమ్మం జిల్లాలో మాతృ-శిశు మరణాలను సున్నాకు తగ్గించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షలో పీహెచ్‌సీల వారీగా హై రిస్క్ గర్భిణీలను గుర్తించి పర్యవేక్షించాలని సూచించారు. సురక్షిత ప్రసవాలపై అవగాహన కల్పించాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని సాధించాలని స్పష్టం చేశారు. అలాగే పాఠశాలల్లో పోక్సో చట్టంపై అవగాహన పెంచాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 13, 2026

పాడేరు: నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి- కలెక్టర్

image

516-ఈ జాతీయ రహదారి నిర్మాణాన్ని గడువులోగా, నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమావేశంలో పనుల పురోగతిని సమీక్షించిన ఆమె, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ ప్రమాణాల మేరకు పనులు ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News April 13, 2026

బూత్ స్థాయి పోలింగ్ ఏజెంట్లను నియమించండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్లను తక్షణమే నియమించాలని కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పక్షాల ప్రతినిథులను కోరారు. సోమవారం తన ఛాంబర్‌లో రాజకీయ పక్షాలతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. రానున్న సమావేశం లోపు ఏజెంట్లను నియమించాలన్నారు. ఏజెంట్ల నియామకం పూర్తయిన వెంటనే వారికి శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామన్నారు.