News November 19, 2025

హోటల్‌ రూమ్‌లకు భలే డిమాండ్‌

image

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తుండటంతో పుట్టపర్తిలో లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. రూ.5 వేలు పెట్టినా రూములు దొరకడం లేదు. అయితే, ట్రస్ట్ తరఫున 50 వేల మందికి సరిపడేలా వసతి షెడ్లు ఏర్పాటు చేసి, మూడు పూటలా భోజన సౌకర్యం కల్పించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉతచి బస్సులు ఏర్పాటు చేశారు. దేవభూమి ఆధ్యాత్మక శోభతో వెలుగొందుతోంది.

Similar News

News April 5, 2026

రంగారెడ్డి: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ!

image

రంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు SBI RSETI సువర్ణావకాశం కల్పిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఏప్రిల్ 13 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు పూర్తయ్యాక ఉచితంగా టూల్‌కిట్ అందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 7981951167, 9963562266 నంబర్లలో సంప్రదించాలన్నారు.

News April 5, 2026

చిట్వేలి వద్ద లారీ- కారు ఢీ.. తప్పిన ప్రాణనష్టం

image

చిట్వేలి మండల పరిధిలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. చిట్వేలి- రాపూరు ఘాట్ రోడ్డులో చిట్వేలి నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ.. నెల్లూరు నుంచి చిట్వేలికి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న చిట్వేలి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News April 5, 2026

నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

image

నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఏఎస్పీ మందా జావళి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 118వ జయంతి పురస్కరించుకుని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.