News January 9, 2026
హోమ్‌లోన్ చెల్లించిన తర్వాత ఇవి మర్చిపోవద్దు

హోమ్ లోన్ తీసుకున్న వారు పూర్తిగా చెల్లించిన తరువాత రిలాక్స్ కాకుండా కొన్ని పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు వద్ద ఉండే టైటిల్ డీడ్, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ వంటి ఆస్తి పత్రాలను తిరిగి పొందాలి. అదే విధంగా తప్పనిసరిగా నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాలి. చివరగా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి తనఖా నుంచి బ్యాంకు హక్కును తీసివేయాలి. దీంతో ఇల్లు మీ చేతుల్లోకి వస్తుంది.
Similar News
News January 11, 2026
మన ఊరు.. ఫస్ట్ విజువల్ ఏంటి..?

ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం ఊరిని వీడిన వారంతా పండగకు తిరిగి వచ్చేస్తున్నారుగా! సొంతూరు ఆలోచన రాగానే గుడి, చదివిన బడి, ఆడుకున్న చెట్టు, వీధి చివర షాపు, మన పొలం, ఊరి చెరువు.. ఇలా ఓ స్పెషల్ విజువల్ మన మైండ్‌లోకి వస్తుంది. ఎప్పుడు ఊరికొచ్చినా ఆ ప్లేస్‌కు వెళ్లడమో, దాని అప్డేట్ తెలుసుకోవడమో పక్కా. మన ఊర్లో మీకున్న ఆ ప్లేస్ ఏంటి? ఈ ఆర్టికల్‌ను మన ఊరి గ్రూప్స్‌లో షేర్ చేయండి, కామెంట్ చేయండి.
News January 11, 2026
‘హిజాబ్ పీఎం’ వ్యాఖ్యలు.. ఒవైసీ vs హిమంత!

హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన <<18819394>>వ్యాఖ్యలపై<<>> మాటల యుద్ధం జరుగుతోంది. ‘ఎవరైనా PM కావచ్చు. కానీ ఇది హిందూ దేశం. హిందూ వ్యక్తే PMగా ఉంటారని మేం నమ్ముతాం’ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. దీంతో హిమంత తలలో ట్యూబ్ లైట్ ఉందని ఒవైసీ ఎద్దేవా చేశారు. దేశం ఏ ఒక్క కమ్యూనిటీకి సొంతం కాదనే రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
News January 11, 2026
మరణించిన వారిని దూషిస్తే..?

మరణించిన వ్యక్తిని నిందించినా, దూషించినా, అవమానించినా శాస్త్రాల ప్రకారం నేరం. మనుస్మృతి, భారతంలోని శాంతి పర్వం ప్రకారం.. వారు తిరిగి సమాధానం చెప్పలేరు కాబట్టి వారి గురించి చెడుగా మాట్లాడటం పిరికిపంద చర్యగా పేర్కొంటారు. ఇలా చేస్తే మనలోని సానుకూల శక్తి నశించి, ప్రతికూలత పెరుగుతుంది. మరణించిన వారు చేసిన తప్పుల కంటే వారిలోని మంచిని మాత్రమే గుర్తుంచుకోవాలి. లౌకిక బంధాలు ముగిసిన వారు దైవంతో సమానం.


