News November 1, 2025

హోమ్ మేడ్ క్యారెట్ సీరం

image

ఈ మధ్యకాలంలో ఫేస్‌గ్లో పెంచుకోవడం కోసం సీరంను ఎక్కువగా వాడుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే సీరంలు కొందరికి సరిపడవు. కాబట్టి సహజంగా ఇంట్లోనే క్యారెట్ సీరం ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 తాజాక్యారెట్‌లు తురుముకోవాలి. ఒక పాత్రలో కొబ్బరి, ఆలివ్/ బాదంనూనె వేడి చేసి క్యారెట్ తురుము వేసి 10నిమిషాలు మరిగించాలి. తర్వాత దీన్ని వడకట్టి పొడి సీసాలో భద్రపరచాలి. దీన్ని రోజూ చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Similar News

News November 1, 2025

‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ అంటూ యాడ్!

image

పాన్ కార్డు, బర్త్, స్టడీ సర్టిఫికెట్స్ పోయాయని కొందరు పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. అయితే అస్సాంలోని ఓ వార్తాపత్రికలో తన డెత్ సర్టిఫికెట్ పోయిందని యాడ్ రావడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రంజిత్ చక్రవర్తి అనే వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ లంబ్డింగ్ బజార్‌లో పోయిందని ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు దీనిపై స్పందించకపోయినా, ఈ తప్పు ప్రకటన ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

News November 1, 2025

వరి పొలం గట్లపై కంది మొక్కల పెంపకంతో ఏమిటి లాభం?

image

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.

News November 1, 2025

ఎల్లుండి నుంచి ప్రైవేటు కాలేజీల బంద్!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో ₹900Cr చెల్లించాలంటూ ప్రైవేటు కాలేజీలు విధించిన డెడ్‌లైన్ నేటితో ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎల్లుండి(NOV 3) నుంచి నిరవధిక బంద్‌కు కాలేజీలు సిద్ధమవుతున్నాయి. 2024-25 వరకు ₹9వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దసరాకు ముందు ₹1,200Cr రిలీజ్ చేస్తామన్న ప్రభుత్వం ₹300Cr మాత్రమే చెల్లించిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.