News October 9, 2025
హోమ్ స్టే విధానంపై పర్యాటక శాఖ వర్క్‌షాప్

విశాఖలో హోమ్ స్టే, బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ విధానాలపై అక్టోబర్ 10న ఉదయం 10 గంటలకు VMRDA చిల్డ్రన్ ఎరీనాలో పర్యాటక శాఖ అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. సొంత ఇళ్లలో కొంత భాగాన్ని పర్యాటకులకు వసతిగా కల్పించి, ఆదాయం పొందాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశమని జిల్లా పర్యాటక అధికారి తెలిపారు. ఆసక్తిగల పౌరులు హాజరై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News October 8, 2025
కేజీహెచ్‌లో 46 మంది విద్యార్థులకు చికిత్స

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం బాలికల సంఖ్య 46కి తగ్గింది. మొత్తం 64 మంది ఆస్పత్రిలో చేరగా.. వీరిలో మంగళవారం 8 మందిని డిశ్చార్జ్ చేసి పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. బుధవారం మరో 10 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. ప్రస్తుతం 46 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె వెల్లడించారు.
News October 8, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌లో అమ్రిత్ సంవాద్ కార్యక్రమం

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో బుధవారం వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారి ‘అమ్రిత్ సంవాద్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం పవన్ కుమార్ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సూచనలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు ఎస్కలేటర్ వద్ద వృద్ధుల కోసం కేర్ టేకర్, రైలులో మగ, ఆడవాళ్లకి వేర్వేరుగా బాత్రూం ఏర్పాటు చేయాలని సూచించారు.
News October 8, 2025
జగన్ పర్యటనలో మార్పులు: గుడివాడ అమర్నాథ్

మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనలో మార్పులు జరిగాయని, ఆయన కేజీహెచ్‌లో కురుపాం విద్యార్థులను పరామర్శిస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు అనుమతులపై డ్రామా సృష్టిస్తూన్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి ఫ్లెక్సీలు తొలగిస్తూ, ఆంక్షలతో పర్యటనను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.