News March 13, 2025
హోలీని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: CP

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, లోతట్టు ప్రదేశాల్లో, చెరువుల్లో ప్రాజెక్టులలో స్నానాలు చేయునప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు.
Similar News
News February 25, 2026
GNT: జాబ్ మేళాలతో లక్ష మందికి ఉద్యోగాలు

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి లోకేశ్ శాసనసభలో తెలిపారు. ఇందుకోసం క్లస్టర్ బేస్డ్ విధానంతో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పన చేపడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జాబ్ మేళాల ద్వారా 1.08 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
News February 25, 2026
నల్గొండ జిల్లాలో ముగ్గురు వైద్యులపై వేటు

రాష్ట్రంలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నల్గొండ జిల్లాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రియదర్శిని, మాధురి, శ్రీవిద్య మాధ ఉన్నారు.
News February 25, 2026
భద్రత కల్పించాలన్న కాటసాని పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

తనకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాటసాని రాంభూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం పోలీసు భద్రతనేది హోదాగా మారిందని, దానికి ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలని CJI ధర్మాసనం కాటసాని లాయర్‌ను ప్రశ్నించింది. శక్తిమంతులైన మీరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మీకు ముప్పు ఉంటే నిఘా వ్యవస్థలు అంచనా వేస్తాయని పేర్కొంది.


