News March 2, 2026

హోలీ ఎప్పుడు? రేపా? ఎల్లుండా?

image

ఈ ఏడాది హోలీ పండుగ నిర్వహణపై గందరగోళం నెలకొంది. మార్చి 3న హోలీ పండుగ, చంద్రగ్రహణం ఒకే రోజు రావడమే దీనికి కారణం. గ్రహణ ప్రభావం ఉన్నందున ప్రధాన వేడుకలను మార్చి 4న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2వ తేదీన సాయంత్రం 5:55కు ప్రారంభమవుతుంది. మార్చి 3 సాయంత్రం 5:07 గంటల వరకు ఉంటుంది. కాబట్టి సంప్రదాయం ప్రకారం మార్చి 4వ తేదీనే రంగుల హోలీ నిర్వహించుకోవాలి’ అంటున్నారు.

Similar News

News March 6, 2026

రూ.9.8 లక్షల కోట్ల ఆస్తితో ముకేశ్ నంబర్-1

image

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026లో IND నుంచి ముకేశ్ అంబానీ(రిలయన్స్ ఇండస్ట్రీస్) ₹9.8 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో గౌతమ్ అదానీ(₹7.5L Cr), రోష్నీ నాడార్ మల్హోత్రా-HCL(₹3.2L Cr), పూనావాలా-సీరమ్ ఇన్‌స్టిట్యూట్(₹3L Cr), కుమార మంగళం బిర్లా-ఆదిత్య బిర్లా(₹2.5L Cr), దిలీప్ సంఘ్వీ-సన్ ఫార్మా(₹2.3L Cr), అజీమ్ ప్రేమ్‌జీ-విప్రో(₹2.3L Cr), నీరజ్-బజాజ్ ఆటో(₹2.2L Cr) ఉన్నారు.

News March 6, 2026

ఇరాన్‌పై దాడి.. మోదీకి ముందే చెప్పారా?

image

ఇరాన్‌పై దాడులకు కొన్ని రోజుల ముందే పీఎం మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహు దాడి సమాచారం ఇచ్చి ఉండొచ్చనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. అయితే దాంట్లో నిజం లేదని భారత్‌లోని ఆ దేశ అంబాసిడర్ అజార్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే దాడి టైమింగ్ నిర్ణయించామని తెలిపారు. అందుకే మోదీకి ఈ విషయం ముందే తెలిసే ఆస్కారమే లేదని వివరించారు.

News March 6, 2026

థియేటర్లలో ఫ్రీ పార్కింగ్.. హైకోర్టు భారీ ఊరట

image

TG: థియేటర్ల పార్కింగ్ విషయంలో ప్రేక్షకులకు హైకోర్టు భారీ ఊరట కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ కోసం ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన 121 GOను కోర్టు సస్పెండ్ చేసింది. ఇక మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ చూపిస్తే పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందనే విషయం తెలిసిందే.
Share It