News March 13, 2025

హోలీ పండుగ.. వరంగల్ సిటీలో పోలీసుల నజర్

image

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులు ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. హోలీ వేళ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారితో పాటు.. మహిళలు, యువతులపై వారి అనుమతి లేకుండా రంగులు జల్లే వారిపై పోలీసులు నజర్ పెట్టాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News February 27, 2026

పెంటగాన్ ఒత్తిడికి లొంగని ఆంథ్రోపిక్

image

తమ AI మోడల్ ‘క్లాడ్’ను అటానమస్ ఆయుధాల తయారీకి లేదా నిఘాకు ఉపయోగించొద్దన్న రూల్‌ను తొలగించాలని <<19249705>>పెంటగాన్<<>> చేసిన విన్నపాన్ని ఆంథ్రోపిక్ తోసిపుచ్చింది. దీనివల్ల $200 మిలియన్ల రక్షణ ఒప్పందం రద్దయ్యే ప్రమాదం ఉన్నా నైతిక విలువలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 2026 నాటికి ఈ మార్పులు చేయాలని ఒత్తిడి వస్తున్నప్పటికీ మానవ ప్రమేయం లేని యుద్ధ తంత్రాలకు AIని అనుమతించబోమని కంపెనీ తేల్చిచెప్పింది.

News February 27, 2026

నిర్మల్: మహిళా చేతికి బస్ స్టీరింగ్

image

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘ఇందిరా శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు బస్సులను పంపిణీ చేయనుంది. వీటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు రూ.69,468 ఆదాయం లభించనుంది. రూ.36 లక్షల బస్సు విలువలో సేర్ఫ్ ద్వారా రూ.30 లక్షలు, బ్యాంకు ద్వారా రూ.6 లక్షలు రుణం అందించనున్నారు. ఈ పథకం ద్వారా మహిళా సంఘాల ఆదాయం పెరిగి, వారు స్వయం సమృద్ధి సాధించనున్నారు.

News February 27, 2026

పోలీస్ భవనాల ప్రారంభానికి డీజీపీ.. ఖమ్మంలో హై అలర్ట్

image

రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నూతన పోలీస్‌ భవనాల ప్రారంభోత్సవం నిమిత్తం ఆయన వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.