News August 13, 2024
హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణంతో వరద నీటికి చెక్

రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా బల్దియా చర్యలు చేపట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హోల్డింగ్ స్ట్రక్చర్లను నిర్మిస్తోంది. ఇందుకు లక్ష, 5లక్షలు, 10లక్షల లీటర్ల కెపాసిటీతో పాయింట్ల వారీగా ట్యాంకుల నిర్మాణాలను చేపడుతోంది. గ్రేటర్ సిటీలో రూ.10కోట్లతో 50 ప్రాంతాల్లో నిర్మించనుంది. ఇటీవల అసెంబ్లీ సెషన్స్‌లోనూ వీటిపైన సీఎం రేవంత్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు.
Similar News
News January 8, 2026
IT కారిడార్‌లో అర్ధరాత్రి బేఫికర్!

ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చే టెక్కీలైనా, రాత్రివేళ నడిచే సామాన్యులైనా చీకటి గల్లీల్లో అడుగు వేయాలంటే భయం. ఈ భయాన్ని పోగొట్టడానికే శేరిలింగంపల్లిలో రూ.50 కోట్లతో జీహెచ్‌ఎంసీ కొత్త వెలుగులు నింపుతోంది. కేవలం లైట్లు వేయడమే కాదు.. అవి ఐదేళ్ల పాటు వెలిగేలా గ్యారెంటీ బాధ్యత కూడా కాంట్రాక్టరుదేనని అధికారులు తెలిపారు. దీంతో మన రోడ్లపై రాత్రిపూట కూడా సురక్షితంగా, ధీమాగా తిరిగే భరోసా లభిస్తుంది.
News January 8, 2026
కాచిగూడలో హిందూ- ముస్లిం లవ్ మ్యారేజ్

నగరంలో అంతర్మత వివాహం చట్టబద్ధంగా నమోదైంది. హిందూ–ముస్లిం యువతి యువకుల మధ్య జరిగిన ఈ వివాహాన్ని కాచిగూడ PSలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేశారు. మేజర్ల సమ్మతితో, అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ వివాహ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
News January 8, 2026
HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

సిటీ నుంచి సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక టికెట్ ధరలు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకు స్పెషల్ రేట్స్ ఉంటాయి. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.


