News September 8, 2024
హౌరా నుంచి యశ్వంతపూర్ వరకు రైలు పొడిగింపు
హౌరా నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు నడుస్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (22831/32)ను యశ్వంతపూర్ వరకు పొడిగించారు. ఇది హౌరా నుంచి ధర్మవరం వరకు యథావిధిగా నడుస్తుంది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి రాత్రి 9:30 గంటలకు చేరుకుని హిందూపురం, యలహంక(స్టాపులు) మీదుగా యశ్వంత్‌పూర్‌కి రాత్రి 12:15కు చేరుకుంటుంది. తిరిగి యశ్వంత్‌పూర్‌లో ఉదయం 5కు బయలుదేరి ప్రశాంతి నిలయానికి ఉదయం7:53కి చేరుకుంటుంది.
Similar News
News January 10, 2025
సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతపురం ఎంపీ
బెంగళూరులోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో గురువారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించి, వాటిపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, రైతులకు ఇన్సెంటివ్ అందించాలని, రీలింగ్ యూనిట్ మెషిన్లకు జీఎస్టీ రద్దు చేయాలని కోరారు.
News January 9, 2025
పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఎన్హెచ్‌ఏఐ, రైల్వే, రోడ్లు భవనాలు, అటవీ శాఖ, చిన్న నీటిపారుదల, భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగే భూసేకరణకు సంబంధించి జరిగే సమావేశాలలో ఎన్‌హెచ్ పీడీ హాజరుకావాలని హెచ్చరించారు.
News January 9, 2025
ఆలయాల వద్ద ప్రత్యేక భద్రత: ఎస్పీ
అనంతపురం జిల్లాలో ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. శుక్రవారం జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయాలకు వచ్చే ప్రజలందరూ పోలీసులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.