News April 3, 2024
హౌరా – యశ్వంత్ పూర్ మధ్య స్పెషల్ ట్రైన్

హౌరా – యశ్వంత్ పూర్ మధ్య వీక్లీ AC స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారి ఏకే త్రిపాఠి తెలిపారు. హౌరా – యశ్వంత్ పూర్ (02863) ట్రైన్ ఈ నెల 4,11 తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రారంభమయ్యి, మరుసటి రోజు 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయల్దేరి అదేరోజు రాత్రికి 12.15 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. యశ్వంత్‌పూర్ 6,13 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు.
Similar News
News September 26, 2025
విజయనగరం వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష: ఎస్పీ

పొక్సో కేసులో పట్టణంలోని మేధరవీధికి చెందిన గ్రంధి పైడిరాజుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. 4ఏళ్ల బాలికను బైక్‌పై తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు ధర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారన్నారు. నేరం రుజువు కావడంతో ఐదు నెలల్లోనే శిక్ష ఖరారైందన్నారు. బాదితురాలికి రూ.2లక్షల పరిహారం మంజూరైందన్నారు.
News September 25, 2025
VZM: రేపు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పర్యటన

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విమలారాణి గురువారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ‘నవరాత్రి పోషణ్ మహా ప్రోగ్రాం’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం వన్ స్టాప్ సెంటర్‌ను సందర్శించనున్నారని చెప్పారు.
News September 25, 2025
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

విజయనగరం కలెక్టరేట్‌లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రతకు పాటు పడాలని పిలుపునిచ్చారు. రోజుకో ఓ గంట సమయం సేవకు కేటాయించాలని కలెక్టర్ సిబ్బందికి చెప్పారు. కలెక్టర్‌తో పాటు జేసీ సేదుమాధవన్, అధికారులు, నాయకులు, మున్సిపల్ తదితరులు ఉన్నారు.