News February 27, 2025

హ్యాట్సాఫ్.. విశాఖ పోలీస్..!

image

మహా శివరాత్రి సందర్భంగా గురువారం విశాఖలో భక్తులు పెద్దఎత్తున సముద్ర స్నానాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విశాఖ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. పుణ్య స్నానాలు ఆచరిస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలోకి వెళ్లిపోయిన ఆరుగురిని గజ ఈతగాళ్ల సాయంతో రక్షించారు. జనసంద్రంలో తప్పిపోయిన 10 మంది చిన్నారులను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News September 15, 2025

మధురవాడలో ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

image

మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.

News September 14, 2025

రుషికొండ బీచ్‌లో ఇద్దరు బాలురు గల్లంతు

image

రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. పీఎం పాలెం, ఆర్‌హెచ్‌ కాలనీ ప్రాంతాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయితో పాటు మరో ఇద్దరు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగగా అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని మెరైన్ పోలీసులు, లైఫ్ గాడ్స్ కాపాడారు. సంజయ్, సాయి అచూకీ ఇంకా లభ్యం కాలేదని పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.

News September 14, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మోదీ ఆదుకుంటున్నారు: మాధవ్

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వాజపేయి ఆదుకున్నట్టే నేడు మోదీ ఆదుకుంటున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. సారథ్యం యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమెరికా టారిఫ్‌లతో ఏపీలో పలు వర్గాలు నష్టపోతున్నాయని, ఆత్మనిర్భర్ భారత్ దీన్ని పరిష్కరించగలదని పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యమాన్ని ఏపీ బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. బీజేపీని ఇంటింటికి విస్తరించడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు.