News January 5, 2026
హ్యాపీ హార్మోన్స్ కోసం ఇలా చేయాలి

ఎమోషన్స్ బావుండటానికి, రోజంతా హ్యాపీగా ఉండటానికి శరీరంలో సెరటోనిన్ హార్మోన్ సరిపడినంత ఉండటం ముఖ్యం. దీన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. పీచు పదార్థాలు, ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం, రోజూ ఎండలో కాసేపు ఉండటం, ధ్యానం చేయడం వల్ల సెరటోనిన్ పెరుగుతుంది.. ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ మెదడులో సెరటోనిన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇది గుడ్లు, నట్స్, సీడ్స్, సాల్మన్ ఫిష్‌లో ఎక్కువగా ఉంటుంది.
Similar News
News January 28, 2026
‘అజిత్’ రాజకీయ వారసులు ఎవరు?

మహారాష్ట్ర Dy CM అజిత్ పవార్ అకాలమృతి ఆయన రాజకీయ వారసత్వంపై ఊహాగానాలకు తెరతీసింది. కుమారుడు పార్థ్ లేదా భార్య సునేత్ర (రాజ్యసభ MP) పవార్ వారసత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బారామతి టెక్స్‌టైల్ కంపెనీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సునేత్ర గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. శరద్ పవార్ NCP నుంచి విడిపోయి అజిత్ BJP-శివసేన కూటమిలో చేరడం తెలిసిందే. కాగా వారసుల నిర్ణయాలు MH ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
News January 28, 2026
కడప జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: <
News January 28, 2026
‘పాక్.. మేం రెడీగా ఉన్నాం’.. ఐస్‌ల్యాండ్ ట్రోల్

T20 WCను బాయ్‌కాట్ చేస్తామని <<18966853>>బెదిరిస్తున్న<<>> పాకిస్థాన్‌ను ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు ట్రోల్ చేసింది. పాక్ ప్లేస్‌లో తాము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. ‘WCలో పాక్ ఆడుతుందో లేదో త్వరగా చెబితే బాగుంటుంది. ఫిబ్రవరి 2న వారు వైదొలిగిన వెంటనే మేం బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. ఫిబ్రవరి 7న సరైన సమయానికి కొలంబోకు చేరుకోవడం కష్టమవుతుంది’ అంటూ రాసుకొచ్చింది.


