News July 25, 2024
కవచ్ కోసం ₹1,112 కోట్లు: రైల్వే మంత్రి
రైలు ప్రమాదాల నివారణకు డిజైన్ చేసిన ‘కవచ్’ కోసం FY25లో ₹1,112.57 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘ఇప్పటివరకు కవచ్‌పై ₹1,216.77Cr ఖర్చు చేశాం. దక్షిణ మధ్య రైల్వేలో ‘కవచ్’కు సంబంధించిన RFID ట్యాగ్‌లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అమరికలు 1,465 రూట్ Kmలో 144 ఇంజిన్లలో పూర్తయ్యాయి. మరో 6000 Km మేర కవచ్‌ను తెచ్చేందుకు DPR రూపొందింది’ అని పార్లమెంటులో బుధవారం తెలిపారు.
Similar News
News January 28, 2025
బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్
TG: గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ పేరు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
News January 28, 2025
నిద్రపోయే ముందు ఇలా చేయట్లేదా?
శరీరం డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉండాలంటే తగినంత నీరు అవసరం. రోజును గ్లాసు నీళ్లతో ప్రారంభించడమే కాకుండా నిద్ర పోయే ముందూ గ్లాసు నీరు తాగడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుందంటున్నారు. అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నవారు గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.
News January 28, 2025
భార్య ముందు హీరో అవ్వాలా అంటూ కొత్త ఆఫర్!
మలేషియాకు చెందిన షజాలీ సులేమాన్ అనే వ్యక్తి వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. భార్యల ముందు హీరో అవ్వాలనుకునే భర్తలు తనను విలన్‌గా అద్దెకు తీసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపాడు. భర్త దగ్గర లేని సమయంలో తాను వచ్చి భార్యను వేధిస్తానని, వెంటనే భర్త వచ్చి తనను కొట్టి భార్యను కాపాడి ఆమె ముందు హీరో కావొచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీనికోసం వారాంతాల్లో రూ.2963, ఇతర రోజుల్లో రూ.1975 ఛార్జ్ చేస్తున్నాడు.