News February 24, 2026
₹130 కోట్ల రివార్డున్న క్రిమినల్ హతం.. ప్రియురాలే కారణం!

మెక్సికోలో రూ.130 కోట్ల రివార్డు ఉన్న డ్రగ్ కార్టెల్ బాస్ ‘ఎల్ మెంచో’ <<19213322>>హతమవడానికి<<>> పరోక్షంగా అతని ప్రియురాలు కారణమయ్యారు. ఆమెను కొన్నిరోజులుగా ట్రాక్ చేసి అతని జాడను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ‘మరుసటి రోజే డ్రగ్ డాన్ స్థావరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అతను అడవిలోకి పారిపోయాడు. వెంటాడి అటాక్ చేయడంతో ఎల్ మెంచో, అనుచరులు గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయారు’ అని వెల్లడించారు.
Similar News
News February 26, 2026
సరైన నిద్రలేకపోతే అందానికి దెబ్బ

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది అందాన్నీ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేకపోతే శరీరం పీహెచ్ దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.
News February 26, 2026
‘కాళేశ్వరం’ రుణాలు.. తగ్గిన వడ్డీ భారం

TG: కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ₹71,566Cr రుణం విడుదలైంది. వార్షిక వడ్డీ 9.45-10.90%. ఇప్పటికే కొంత చెల్లించగా ఇంకా ₹68,273Cr బాకీ ఉంది. వడ్డీని 7.5 శాతానికి తగ్గించడానికి కేంద్రం అంగీకరించడంతో ఒకేసారి ₹33,574Crను ప్రభుత్వం చెల్లించింది. మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక వాయిదాల కింద చెల్లిస్తామని తెలిపింది.
News February 26, 2026
శ్రీవారికి నగదే కాదు ‘ముడుపు పత్రాలు’ సమర్పించవచ్చు!

AP: తిరుమలలో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు కొత్త విధానాన్ని TTD అమలు చేయనుంది. త్వరలో ‘శ్రీవారి ముడుపు పత్రం’ పేరుతో ప్రత్యేక పత్రాలను జారీ చేయనుంది. ₹100 నుంచి ₹లక్ష వరకు UPI, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసి హుండీలో సమర్పించవచ్చు. క్యాష్‌లెస్ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి జరిగే TTD బోర్డు మీటింగ్‌లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.


