News January 27, 2025

₹16k టికెట్ ₹60k: కుంభమేళా భక్తులపై ఎయిర్‌లైన్స్ దోపిడీ

image

దొరికిందే తడవుగా అందినకాడికి దోచుకొనేందుకు ఎయిర్‌లైన్స్ సిద్ధమయ్యాయి. మహా కుంభమేళాలో త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించాలనుకున్న భక్తులకు షాకిస్తున్నాయి. టికెట్ రేట్లను విపరీతంగా పెంచేశాయి. ముంబై, ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ₹16k టికెట్ ఉండగా ఇప్పుడు ₹50k-60k వరకు ఛార్జ్ చేస్తున్నాయి. HYD నుంచీ అదే పరిస్థితి. ఫిర్యాదులు రావడంతో ఛార్జీలను రేషనలైజ్ చేయాలని DGCA ఆదేశించినట్టు తెలిసింది.

Similar News

News January 28, 2025

టెన్త్ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

image

AP: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.

News January 28, 2025

BJPలోకి అంబటి రాయుడు?

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుుడు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా రాయుడు గతంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి జనసేన పార్టీతో కనిపించారు.

News January 28, 2025

IND vs ENG: మనోళ్లు సిరీస్ పట్టేస్తారా?

image

భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.