News April 2, 2024
₹2,000 నోట్లు 97.69% తిరిగివచ్చాయి: ఆర్బీఐ

రద్దు చేసిన ₹2వేల నోట్లలో ఇప్పటివరకు 97.69% బ్యాంకులకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇంకా ₹8,202 కోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. గత ఏడాది మే 19న ₹2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు 3.56 లక్షల కోట్ల విలువైన ₹2వేల నోట్లు చలామణిలో ఉండేవి. ప్రస్తుతం దేశంలోని 19 ఆర్బీఐ కేంద్రాల్లో వీటిని మార్చుకునేందుకు అవకాశం కల్పించారు.
Similar News
News March 26, 2026
సుప్రీంలీడర్‌గా ఉండమని ఇరాన్ కోరింది: ట్రంప్

ట్రంప్ వంటి వ్యక్తులతో అసలు చర్చలే చేయమని <<19472137>>ఇరాన్<<>> అంటున్న వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంలీడర్‌గా బాధ్యతలు తీసుకోమని ఇరాన్ తనను అనధికారికంగా కోరిందని.. కానీ తనకు అవసరం లేదని ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వీలైనంత త్వరగా డీల్ చేసుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు.
News March 26, 2026
CSK బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు.. ఓపెనర్స్ ఎవరంటే?

ఈ ఏడాది IPLలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయనున్నట్లు CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించారు. సంజూ శాంసన్, తాను ఇన్నింగ్స్ ప్రారంభిస్తామని కెప్టెన్స్ డే ఈవెంట్‌లో తెలిపారు. ఈ సీజన్‌లో ఆయుష్ మాత్రే ఓపెనర్‌గా దిగడం లేదని చెప్పారు. దీంతో అతను మూడో స్థానంలో, బ్రెవిస్ ఫోర్త్ ప్లేస్‌లో ఆడే అవకాశం ఉంది. కాగా గత సీజన్ ఆరంభంలో చెన్నై ఓపెనింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
News March 26, 2026
చరణ్‌కు సర్జరీ.. వైద్యుడికి చిరు థాంక్స్

‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా హీరో రామ్ చరణ్ కంటిరెప్ప పైభాగంలో చిన్న గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సకాలంలో శస్త్రచికిత్స చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు నైపుణ్యంతో చేసిన సర్జరీ మాకు నిజంగా ఓ వరంలాంటిది. ఆ సమయంలో మేమెంతో ఆందోళన చెందినా మీ నైపుణ్యం దానిని తొలగించింది. మీకు కృతజ్ఞులం’ అని చిరు ట్వీట్ చేశారు.


