News October 7, 2024
అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు ₹23 కోట్లు అంటూ ప్రచారం.. ప్రభుత్వం ఏమందంటే?

AP: ఇటీవల వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. బాధితులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందించడంతోపాటు మొబైల్ జనరేటర్ల ద్వారా విద్యుత్ సమస్యలు తీర్చామని తెలిపింది. వాటన్నిటికీ కలిపి రూ.23 కోట్ల ఖర్చయిందని, అందులోనూ మొబైల్ జనరేటర్లకు ఎక్కువ మొత్తం వెచ్చించామని పేర్కొంది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరింది.
Similar News
News March 26, 2026
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఆస్కారముందని చెప్పింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News March 26, 2026
RCB ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

IPL: ఎల్లుండి లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో RCB జట్టు కీలక బౌలర్ హేజిల్‌వుడ్ ఇండియా చేరుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ NOC ఇవ్వడంతో ఆయన కొద్దిసేపటి కిందటే బెంగళూరుకు వచ్చారు. ఇవాళ RCB క్యాంప్‌లో జాయిన్ కానున్న ఆయన 28వ తేదీ SRHతో జరిగే తొలి మ్యాచులో ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఆ జట్టు కీలక బౌలర్ యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో దూరమైన వేళ హేజిల్‌వుడ్ రాకతో RCB బౌలింగ్ దళం బలం పుంజుకున్నట్లు అయింది.
News March 26, 2026
సమ్మర్ స్పెషల్: మీ పిల్లలను ఛాంపియన్లుగా మార్చండి!

వేసవి సెలవుల్లో పిల్లల సమయాన్ని వృథా చేయకుండా ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్పించండి. ముఖ్యంగా పిల్లల శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో స్విమ్మింగ్ నేర్పించడం వల్ల శరీరం చల్లబడటమే కాక మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే ఏకాగ్రత కోసం యోగా, మెడిటేషన్.. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఇవి పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తాయి. <<-se>>#SummerSPL<<>>


