News February 27, 2025
స్టూడెంట్స్ బుక్స్‌లో ₹3.5కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!

పుణే ఎయిర్‌పోర్టులో భారీ హవాలా రాకెట్ బయటపడింది. ముగ్గురు స్టూడెంట్స్ దుబాయ్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజెంట్ ఖుష్బూ అగర్వాల్ వద్ద టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లయిట్ ఎక్కే 2hrs ముందు వారికామె 2 బ్యాగుల్లో బుక్స్ పెట్టి దుబాయ్‌లోని తమ బ్రాంచ్‌లో ఇవ్వమన్నారు. విషయం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని అక్కడి నుంచి మళ్లీ పుణేకి రప్పించారు. చెక్ చేసి బుక్స్‌లోని $4L (Rs 3.5CR)ను స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 7, 2026
US గుప్పిట్లోకి వెనిజులా సంపద.. 5 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ హస్తగతం!

వెనిజులాలో మదురో ప్రభుత్వ పతనం తర్వాత అక్కడి వనరులపై అమెరికా పట్టు సాధించే దిశగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం తమకు 3-5 కోట్ల బ్యారెళ్ల చమురును అప్పగించబోతోందని ట్రంప్ ప్రకటించారు. దీన్ని మార్కెట్ ధరకే విక్రయించి.. వచ్చే నిధులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. వాటిని వెనిజులా, అమెరికా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని తెలిపారు.
News January 7, 2026
ఈ నెల 16న బ్యాంకులకు సెలవు

AP: ఈ నెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం తాజాగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు వారంలో 5 వర్కింగ్ డేస్ కోసం ఈ నెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం తెలిసిందే.
News January 7, 2026
వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచే ఆలోచనలు

వ్యవసాయంలోనే కాదు ఏ రంగంలోనైనా వినూత్నంగా ఆలోచించినప్పుడే ఆదాయం, అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఆ ఆలోచనలు మరీ గొప్పవే కానవసరం లేదు. తమకు వచ్చిన చిన్న చిన్న ఐడియాలనే సాగులో అమలు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు మనదేశంతో పాటు కొన్ని దేశాల్లోని రైతులు. అసలు ఆ ఆలోచనలు ఏమిటి? మనం అనుసరించడానికి అవకాశం ఉందా? ఆదాయం పెంచే ఆ ఐడియాల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


