News December 12, 2024
₹3L కోట్లు: 2024లో INCOME TAX రికార్డులివే..
FY25లో ట్యాక్స్ రీఫండ్ చెల్లింపుల్లో రికార్డు సృష్టించామని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. 2024 APR 1 నుంచి NOV 27 వరకు ఏకంగా Rs 3.08 లక్షల కోట్లు చెల్లించినట్టు చెప్పింది. గతేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే ఇది 46.31% ఎక్కువని వివరించింది. ఈ ఏడాది గరిష్ఠంగా ఒక సెకనుకు 900, ఒక రోజు 70 లక్షల ITRలు దాఖలైనట్టు పేర్కొంది. AY 2024-25కు సంబంధించి ఒకేరోజు 1.62 కోట్ల ITRలు ప్రాసెస్ చేసినట్టు వెల్లడించింది.
Similar News
News December 12, 2024
జమిలి ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదం
దేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. గతంలో కోవింద్ కమిటీ సిఫారసులకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
News December 12, 2024
బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైంది: బండి సంజయ్
తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాసరలో లడ్డూలు అందట్లేదు. కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేదు. పండుగలపై ఆంక్షలు పెరుగుతున్నాయి’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ దాడిని చేయిస్తోందా? అని ప్రశ్నించారు.
News December 12, 2024
పోలీసు కస్టడీకి వర్రా రవీందర్
AP: YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కానీ రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పేర్కొంది. చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో రవీందర్ అరెస్టయ్యారు.