News July 29, 2024
పేదల ఇంటి నిర్మాణానికి ₹4 లక్షలు
పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(2.0)కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. కేంద్ర వాటాగా ₹2.50 లక్షలు అందించనుండగా, రాష్ట్ర వాటాగా కచ్చితంగా ₹1.50 లక్షలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇవాళ గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 23 పట్టాణాభివృద్ధి సంస్థల ద్వారా పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹4 లక్షలతో పాటు ఉపాధిహామీ కింద మరో ₹30వేలు అందనుంది.
Similar News
News February 1, 2025
TODAY HEADLINES
* మామూలుగా కాదు గట్టిగా కొడతా: KCR
* KCR.. ముందు నువ్వు సరిగ్గా నిలబడు: రేవంత్
* రేవంత్ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ నాశనం: హరీశ్ రావు
* ఈ ఏడాది కడపలో TDP ‘మహానాడు’
* చాలా ఘోరంగా ఓడిపోయాం.. ఒప్పుకోవాలి: అంబటి
* MLC ఎన్నికల తర్వాత DSC నోటిఫికేషన్: CBN
* భారీగా పెరిగిన బంగారం ధరలు
* 4వ T20లో భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
* రాష్ట్రపతి ప్రసంగంపై INC, BJP మధ్య పొలిటికల్ వార్
News February 1, 2025
పద్మ అవార్డులపై సీఎం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నుంచి పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ఐదుగురి(గద్దర్, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు) పేర్లు తాను సిఫార్సు చేసినట్లు CM రేవంత్ తెలిపారు. వాళ్లు తమ పార్టీ వారు కాకపోయినా, సిద్ధాంతపర విభేదాలున్నా ప్రజల్లో ఉండబట్టే పేర్లు పంపామన్నారు. పక్క రాష్ట్రం APకి ఐదు అవార్డులు ఇచ్చారని, వాళ్లకంటే మేం ప్రతిపాదించిన వాళ్లు తక్కువా? అని గద్దర్ జయంతి సభలో CM ప్రశ్నించారు.
News February 1, 2025
ఈ స్కూల్లో ఏడాదికి రూ.27లక్షలు ఫీజు!
ప్రస్తుతం నాణ్యమైన విద్యను పొందాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాల్సిందే. నర్సరీ పిల్లలకు సైతం కొందరు రూ.4-5 లక్షలు వసూలు చేస్తున్నారు. UAEలో ఉండే గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పాఠశాలలో స్టార్టింగ్ ఫీజే రూ.27లక్షలుగా ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. కేరళకు చెందిన మరియమ్మ, KS వర్కీ 1968లో UAEలో ఈ విద్యాసంస్థను ప్రారంభించి అమెరికా, ఇండియా, ఇంగ్లండ్కూ విస్తరించారు.