News December 30, 2024

₹40K CR: గొడవలున్నా భారత షేర్లలో చైనా బ్యాంకు పెట్టుబడి!

image

సరిహద్దు వివాదం నెలకొన్నప్పటికీ భారత్‌లో చైనా సెంట్రల్ బ్యాంకు (PBOC) భారీ పెట్టుబడులే పెట్టింది. 2024లో రూ.40వేల కోట్ల విలువైన 35 కంపెనీల స్టాక్స్‌ను హోల్డ్ చేసింది. అత్యధికంగా ICICIలో రూ.6139CR, HDFC BANKలో రూ.5303CR, TCSలో రూ.3619CR, పవర్‌గ్రిడ్‌లో రూ.1414CR, కొటక్ బ్యాంకు, HUL, బజాజ్ ఫైనాన్స్‌లో మొత్తంగా రూ.1500CRను ఇన్వెస్ట్ చేసింది. FDIకి అనుమతి లేకపోవడంతో చైనా FPI, FIIల మార్గం ఎంచుకుంది.

Similar News

News January 2, 2025

అదే జరిగితే NDA బలం 301కి జంప్

image

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి! చీలిపోయిన NCPని మళ్లీ ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే జరిగితే లోక్‌సభలో NDAకు కొత్తబలం రావడం ఖాయం. ప్రస్తుతం ఈ కూటమికి 293 ఎంపీలు ఉన్నారు. INDIA కూటమిలోని NCP SPకి 8 మంది సభ్యులున్నారు. NCP కలిస్తే వారంతా అధికార పక్షం వైపు వస్తారు. దీంతో NDA బలం 301కి పెరుగుతుంది. చెరకు రైతుల సమస్యలంటూ ఈ మధ్యే మోదీతో శరద్ పవార్ ప్రత్యేకంగా భేటీ అవ్వడం గమనార్హం.

News January 2, 2025

ఈడీ విచారణకు హాజరుకాని బీఎల్ఎన్ రెడ్డి

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు మరి కొంత గడువు కావాలని ఈడీకి మెయిల్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే మరో తేదీని వెల్లడిస్తామన్నారు.

News January 2, 2025

థియేటర్లో ఉండగానే ఆన్‌లైన్‌లోకి మూవీ.. హీరో ఆవేదన

image

భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ మూవీ ‘మార్కో’ పైరసీ బారిన పడింది. థియేటర్లలో ఉండగానే మూవీ ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. దీనిపై ముకుందన్ అసహనం వ్యక్తం చేశారు. మూవీ పైరసీ కావడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి పైరసీ మూవీని చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ యాక్షన్ మూవీ కేరళలో మంచి టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో నిన్న విడుదలైంది.