News November 29, 2024

రైతులకు ఏడాదిలో ₹54,280 కోట్ల ప్రయోజనం: పొంగులేటి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి అగ్రపీఠం వేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. ఏడాది కాలంలోనే అన్నదాతలకు ₹54,280కోట్ల ప్రయోజనం చేకూరిందని వివరించారు. 22లక్షలకుపైగా రైతులకు ₹17,870Cr రుణమాఫీ, పంటల బీమాకు ₹1,300Cr, ధాన్యం కొనుగోళ్లకు ₹5,040Cr, ఉచిత్ విద్యుత్‌కు ₹10,444Cr, రైతు భరోసాకు ₹7,625Cr, బీమా ప్రీమియానికి ₹1,455Cr, గత యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ₹10,547Cr వెచ్చించినట్లు తెలిపారు.

Similar News

News February 2, 2026

గుడ్ న్యూస్: వేగంగా రైల్వే ప్రాజెక్టులు

image

TG, AP పరిధిలో ఉన్నSC జోన్‌లోని ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ జోన్లో 1,763.26 KMమేర ₹27,342.44 CRతో 18 ప్రాజెక్టులను గతంలో చేపట్టారు. ₹4684 CRతో ముద్ఖేడ్-డోన్ లైన్ విద్యుదీకరణ, ₹3591 CRతో 173 KM పాండురంగాపురం లైన్, ₹3103CRతో విజయవాడ-ఖాజీపేట మధ్య 3వ లైన్ వంటి పనులు పూర్తిచేస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా ఇటీవల SEC-వాడి మధ్య 4వ లైన్‌ను ₹5012 CRతో ఆమోదించింది.

News February 2, 2026

విచారణ దశలోనే ఇల్లీగల్ అని ఎలా అంటారు: హరీశ్ రావు

image

TG: కేసు దర్యాప్తులో ఉండగానే SIT అధికారి సజ్జనార్ ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్’ అని పేర్కొనడంపై BRS నేత హరీశ్ రావు అభ్యంతరం తెలిపారు. ‘దీన్ని చూస్తుంటే దర్యాప్తు ఫలితంపై మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోంది. ఇది రాజకీయ ప్రేరేపిత పక్షపాత దర్యాప్తు అని స్పష్టమవుతోంది. మీ X ప్రకటనలో కనీసం KCRను ప్రతిపక్ష నేత అని సంబోధించడానికీ ఇష్టపడక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?’ అని ప్రశ్నించారు.

News February 2, 2026

నిజమైన కరుంగలి మాలను ఎలా గుర్తు పట్టాలి?

image

మార్కెట్లో నకిలీ మాలలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిజమైన కరుంగలి పూసలు బరువుగా ఉంటాయి. నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతాయి. నకిలీవి తేలుతాయి. నిజమైన పూసలు సహజమైన నలుపు రంగులో ఉంటాయి. తాకితే నునుపుగా, చల్లగా అనిపిస్తాయి. వీటిపై ఎటువంటి రంగు పూత ఉండదు. ఓ పూసను నీటిలో నానబెట్టినప్పుడు నీరు రంగు మారకూడదు. అసలైన కలప కాంతిని సహజంగా ప్రతిబింబించాలి.