News August 14, 2024
₹75 వేల కోట్లతో రిఫైనరీ.. శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్ ఆఫర్!

ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. రూ.75 వేల కోట్లతో ఏర్పాటు చేయనుండగా ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఆ రిఫైనరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట (శ్రీకాకుళం)లో స్థలాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి రిఫైనరీ ఏర్పాటు చేసే అవకాశముంది. దీని ద్వారా 10 వేల ఉద్యోగాలు రానున్నాయి.
Similar News
News December 26, 2025
SRKLM: ప్రమాదాల కట్టడికి ఎస్పీ మాస్టర్ ప్లాన్!

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. మలుపుల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.
News December 26, 2025
శ్రీకాకుళం: పెరిగిన కోడి గుడ్డు ధర ఎంతంటే !

ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. రూ.8 ఉన్న గుడ్డు ధర రూ.10కి చేరింది. హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ.9.30 పలుకుతోంది. ప్రస్తుతం ఒక ట్రే రూ.270 నుంచి రూ.290కి చేరింది. క్రిస్మస్, న్యూఇయర్ కారణంగా ఎగుమతులు పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు.
News December 26, 2025
SKLM: రథసప్తమి ఉత్సవాలపై ప్రజాభిప్రాయ సేకరణ

రథసప్తమి ఉత్సవాలపై ఈనెల 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ శనివారం (ఈనెల 27) సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం నగరంలోని జెడ్పీ మందిరంలో నిర్వహించబడునని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, ఆలయ సంప్రదాయాలను అవగాహన కలిగిన పెద్దలు హాజరుకావాలని వెల్లడించారు.


