News December 23, 2025

₹8 కోట్ల ఆన్‌లైన్ మోసం.. తుపాకీతో కాల్చుకుని మాజీ IPS ఆత్మహత్య

image

సైబర్ మోసానికి మాజీ IPS బలయ్యారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు పంజాబ్‌కు చెందిన అమర్ చాహల్‌(Ex IG)ను నమ్మించారు. ఆయనతో పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయించారు. ఈ క్రమంలో ఆయన రూ.8 కోట్లు మోసపోయారు. తీవ్ర ఆవేదనతో పటియాలాలోని తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని సూసైడ్ నోట్‌లో కోరారు.

Similar News

News December 23, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: బండి సంజయ్

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR, KTRకు <<18647212>>నోటీసులు<<>> ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేశారు. SIB వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కాంట్రాక్టర్లు, లీడర్లను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటారా? దోషులను తేల్చుతారా? అనేది అనుమానమే. కేసును సాగదీస్తున్నారు’ అని పేర్కొన్నారు.

News December 23, 2025

3 నెలల్లో ₹75వేల కోట్ల ఆదాయ లక్ష్యం

image

TG: రానున్న 3 నెలల్లో సొంత పన్నుల ఆదాయం కింద ₹75వేల కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. FY25-26లో ₹1.75 లక్షలCR లక్ష్యం కాగా ఇప్పటివరకు ₹లక్షCR వరకు సమకూరింది. 2026 MAR చివరి నాటికి తక్కిన మొత్తాన్ని సాధించేలా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా శాఖలపై దృష్టి సారించింది. గతేడాది టార్గెట్లో 82% మాత్రమే సాధించింది. ఈ ఏడాది 95%కి పైగా సాధించాలని నిర్ణయించింది.

News December 23, 2025

రేపట్నుంచి విజయ్ హజారే ట్రోఫీ.. బరిలోకి దిగ్గజాలు!

image

దేశవాళీ ODI టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా కీలక ప్లేయర్లు పలు మ్యాచ్‌లు ఆడనున్నారు. అయితే కళ్లన్నీ దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ(ముంబై), విరాట్ కోహ్లీ(ఢిల్లీ)పైనే ఉన్నాయి. BCCI <<18575287>>ఆదేశాల<<>> నేపథ్యంలో వీరిద్దరూ కనీసం 2 మ్యాచుల్లో బరిలోకి దిగనున్నారు. T20 WC జట్టులో చోటు కోల్పోయిన గిల్‌తోపాటు రిషభ్ పంత్‌, సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ కూడా ఆడనున్నారు.