News February 8, 2025
0..0..0: ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739006096036_1199-normal-WIFI.webp)
దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటుషేర్ సంపాదించేది. మాజీ CM షీలాదీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా మూడో సారీ ఖాతా తెరవకుండా హ్యాట్రిక్ డకౌట్ రికార్డు ఖాతాలో వేసుకుంది. క్రితంసారి 3% ఓటుషేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7 శాతంతో ఆనందపడాల్సి వస్తోంది. ఆ పార్టీ దుస్థితిపై మీ కామెంట్.
Similar News
News February 8, 2025
భారత జట్టుకు గుడ్‌న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739016893366_81-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడనున్నారు. కోహ్లీ ఫిట్‌గానే ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లీ కోసం జైస్వాల్‌ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. రేపు కటక్ వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
News February 8, 2025
కొందరు వెన్నుపోటు పొడిచారు: తమన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739014483075_1032-normal-WIFI.webp)
తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా కెరీర్లో నేను ఎంతోమందిని నమ్మి మోసపోయా. వారు నాకు వెన్నుపోటు పొడిచారు. నా ఎదుట మంచిగా ఉండి.. పక్కకు వెళ్లగానే నా గురించి చెత్తగా మాట్లాడేవారు. కొందరిని నమ్మి ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. వీటన్నిటి నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నా. ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే వెంటనే గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్ ఆడతా’ అని చెప్పుకొచ్చారు.
News February 8, 2025
అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ఓ కొడుకు పగ!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739014677510_1199-normal-WIFI.webp)
కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా న్యూఢిల్లీ సీట్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ఓ కొడుకు పగ తోడైంది. 1998, 2003, 2008లో ఇక్కడ Ex CM షీలా దీక్షిత్ హ్యాట్రిక్ కొట్టారు. 2013లో ఆమెను ఓడించి AK CM అయ్యారు. ఇక్కడ 3 సార్లు గెలిచిన ఆయన ఈసారి 4089 ఓట్లతో ఓడారు. షీలా కొడుకు సందీప్ దీక్షిత్ (INC)కు ఇక్కడ వచ్చిన ఓట్లు 4568. వీటిని చీల్చకపోతే AKదే విజయం. ఇలా తన తల్లి ఓటమికి ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు.