News March 28, 2025
1న ఉదయం 7 గంటలకే సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభం

జిల్లా పరిధిలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 1న ఉదయం ఏడు గంటలకే ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో 2,61,841 మంది లబ్ధిదారులు ఉండగా వారికి రూ.111.82 కోట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి లబ్ధిదారులకు నగదు అందజేస్తారన్నారు. ఆరోజు పింఛన్ పొందే ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఉండి నగదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 18, 2025
BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు.

హిడ్మాపై రూ.6 కోట్ల రివార్డ్

దళ సభ్యుడిగా 1996లో మావోయిస్టుల్లో చేరిన హిడ్మా పెద్దగా తుపాకీ పట్టలేదు. కానీ క్యాడర్కు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? దాడి చేయాలనే వ్యూహాలు, సూచనలిస్తాడు. దేశంలో పోలీసులు, ప్రముఖ నేతలపై జరిగిన 26 పెద్ద దాడులకు హిడ్మానే నాయకత్వం వహించాడు. అతడిపై కేంద్ర రూ.45 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలది కలిపి ఇది రూ.6కోట్ల రివార్డ్ ఉంది. కాగా ఇవాళ అల్లూరి జిల్లాలో హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బే.