News August 24, 2024
1న ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక
నరసరావుపేట శంకరభారతీపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల ఖోఖో జట్ల ఎంపికలు సెప్టెంబర్ 1న జరుగుతాయని ఆ సంఘం కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. ఆసక్తి గలవారు 01.10.2010 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. వయసు, ఎత్తు, బరువు కలిపి 215 పాయింట్లు మించి ఉండరాదన్నారు. ఒక పాఠశాల నుంచి ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఎంపికలకు హాజరు కావాలన్నారు.
Similar News
News October 14, 2024
యువగళం పాదయాత్రలోని మరో హామీని నెరవేర్చా: లోకేశ్
యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చినట్లు మంత్రి లోకేశ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు. వారి సెంటిమెంట్‌ను గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు లోకేశ్ తెలియజేశారు.
News October 13, 2024
చిలకలూరిపేటలో జాబ్‌మేళా..1000 పైగా ఉద్యోగాలు
చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడులోని యువత కోసం ఈనెల 19వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. 30కి పైగా కంపెనీలు, 1000కి పైగా జాబ్ ఆఫర్లతో ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు. 2016-2024 మధ్య 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఎంటెక్ చేసిన వారంతా అర్హులేనని అన్నారు. Shareit
News October 13, 2024
గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
డీఎస్సీ ఉచిత శిక్షణకు అర్హులైన SC,ST అభ్యర్థుల నుంచి ఏపీ సాంఘిక సంక్షేమశాఖ అమరావతి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత బోధన, భోజన, వసతి సౌకర్యాలతో పాటు 3 నెలల ఉచిత శిక్షణ పొందుటకు అవకాశం కల్పించారు. http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని, అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2.50లక్షల లోపు ఉండాలన్నారు.