News January 28, 2025
1వ తేదీ నుంచి బాపట్లలో హెల్మెట్ తప్పనిసరి

బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని డీఎస్పీ రామాంజనేయులు స్పష్టం చేశారు. బైకు నడిపేవారే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలన్నారు. లేదంటే మోటర్ వెహికల్ చట్టం ప్రకారం జరిమానా విధిస్తామన్నారు. పోలీసులు మినహాయింపు కాదని వారు కూడా హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలన్నారు. లేకపోతే వారికి కూడా ఫైన్ వేస్తామన్నారు.
Similar News
News February 15, 2025
నాపై రాజకీయ ముద్రతో అవకాశాలు కోల్పోయా.. సింగర్ ఆవేదన

శ్రీకాకుళంలోని అరసవల్లి రథసప్తమి వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానంతో తానొక కళాకారిణిగా పాల్గొన్నట్లు సింగర్ మంగ్లీ తెలిపారు. ఎన్నికల సమయంలో YCP సంప్రదిస్తే ఒక ఆర్టిస్ట్‌గానే పాటలు పాడానని, BRS, బీజేపీ నేతలకూ పాడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తనపై రాజకీయ ముద్ర వేయడంతో చాలా అవకాశాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని విజ్ఞప్తి చేశారు.
News February 15, 2025
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర: కలెక్టర్

ప్రతి 3వ శనివారం జిల్లాలో తప్పనిసరిగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో అధికారులు ఈ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వ్యర్ధాల నుంచి సంపద సృష్టి దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ డీఆర్ఓ మురళి పాల్గొన్నారు.
News February 15, 2025
రాజాపేట: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

పొట్టకూటి కోసం తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడి గీతకార్మికుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజాపేట మండలంలో శనివారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల.. నెమిలి గ్రామానికి చెందిన పాల సిద్ధులు గౌడ్ నేటి ఉదయం రోజువారీగా కల్లుగీత కోసం తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభుత్వ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.