News March 28, 2025

1న ఉదయం 7 గంటలకే సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభం

image

జిల్లా పరిధిలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 1న ఉదయం ఏడు గంటలకే ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో 2,61,841 మంది లబ్ధిదారులు ఉండగా వారికి రూ.111.82 కోట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి లబ్ధిదారులకు నగదు అందజేస్తారన్నారు. ఆరోజు పింఛన్ పొందే ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఉండి నగదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 31, 2025

ADB: గ్రూప్-1లో అమరేందర్‌కు 149 ర్యాంకు 

image

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్‌ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 31, 2025

రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్ చేయాలా?

image

రోహిత్ నాయకత్వంలో 5 సార్లు ఐపీఎల్ కప్ కొట్టిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు ఒక్క గెలుపు కోసం ఎదురుచూస్తోంది. ముంబై మళ్లీ గెలుపు బాట పట్టాలంటే రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ అప్పగించాలని కొందరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. హార్దిక్ సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని, కెప్టెన్సీ ఒత్తిడితో బ్యాటింగ్‌లోనూ తేలిపోతున్నారని చెబుతున్నారు. మరి హిట్‌మ్యాన్‌కు సారథ్యం అప్పగించాలనే అభిప్రాయంపై మీ కామెంట్?

News March 31, 2025

ములుగు జిల్లాలో చికెన్ ధరలకు రెక్కలు!

image

ములుగు జిల్లాలో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరగడంతో సాధారణ ప్రజలు కోడి కూర తినే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇటీవల రూ.200, రూ.220 పలికిన కేజీ చికెన్ ధర ఒక్కసారిగా రూ.260, రూ.280కి చేరడంతో పండగల వేల చికెన్ కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో సరఫరా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

error: Content is protected !!