News August 24, 2024
1న ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక

నరసరావుపేట శంకరభారతీపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల ఖోఖో జట్ల ఎంపికలు సెప్టెంబర్ 1న జరుగుతాయని ఆ సంఘం కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. ఆసక్తి గలవారు 01.10.2010 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. వయసు, ఎత్తు, బరువు కలిపి 215 పాయింట్లు మించి ఉండరాదన్నారు. ఒక పాఠశాల నుంచి ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఎంపికలకు హాజరు కావాలన్నారు.
Similar News
News September 17, 2025
GNT: CM ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్

DSC నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం సమీక్షించారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర సచివాలయం దగ్గర DSCలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రాంగణంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో SP వకుల్ జిందాల్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, గుంటూరు RDO శ్రీనివాస రావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.
News September 17, 2025
బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. మట్టి నమూనాల సేకరణ

హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించతలపెట్టిన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా, గుంటూరు జిల్లాలో ఫైనల్ లొకేషన్ సర్వే బుధవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. DPR రూపొందించడం, ఫైనల్ ఎలైన్మెంట్ డిజైన్ కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా, 20 మీటర్ల లోతులో ప్రతి 5 మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు.
News September 17, 2025
శాసన సభ స్పీకర్ను కలిసిన గుంటూరు ఎస్పీ

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంతోపాటు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకొని ప్రజా భద్రతను కాపాడాలని స్పష్టం చేశారు.