News January 28, 2025
1వ తేదీ నుంచి బాపట్లలో హెల్మెట్ తప్పనిసరి

బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని డీఎస్పీ రామాంజనేయులు స్పష్టం చేశారు. బైకు నడిపేవారే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలన్నారు. లేదంటే మోటర్ వెహికల్ చట్టం ప్రకారం జరిమానా విధిస్తామన్నారు. పోలీసులు మినహాయింపు కాదని వారు కూడా హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలన్నారు. లేకపోతే వారికి కూడా ఫైన్ వేస్తామన్నారు.
Similar News
News November 14, 2025
డబుల్ సెంచరీ దిశగా NDA!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం దిశగా NDA దూసుకువెళ్తోంది. ప్రస్తుతం 191 సీట్లలో లీడింగ్‌లో ఉండగా డబుల్ సెంచరీ దిశగా సాగుతోంది. మహాగఠ్‌బంధన్ హాఫ్ సెంచరీ మార్క్ కూడా దాటలేదు. ప్రస్తుతం 48 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉంది. తేజస్వీ యాదవ్ వంటి కీలక నేతలు కూడా వెనుకబడటం గమనార్హం.
News November 14, 2025
దేశానికి గేట్‌వేలా AP.. అభివృద్ధికి ఆకాశమే హద్దు: CM

AP: పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని CM CBN తెలిపారు. ‘దేశానికి AP గేట్‌వేలా మారుతోంది. రాష్ట్రానికి స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్ సిటీలు, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయి. వనరులు సమృద్ధిగా వాడుకుంటే అభివృద్ధికి ఆకాశమే హద్దు. మరో రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి. అభివృద్ధిలో పర్యాటక రంగానిదే కీలక పాత్ర’ అని CII సదస్సులో పేర్కొన్నారు.
News November 14, 2025
బిహార్ రిజల్ట్స్: 6 రీజియన్లూ NDA వైపే

బిహార్‌లోని అన్ని రీజియన్లలో NDA భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. అంగప్రదేశ్లోని 27 సీట్లలో 23 చోట్ల ముందంజలో ఉంది. భోజ్‌పూర్‌లో 46 సీట్లలో 32, మగధలోని 47 సీట్లలో 35, మిథిలాంచల్‌లో 50 సీట్లలో 40, సీమాంచల్‌లో 24 సీట్లలో 20, తిర్హుత్‌లో 49 సీట్లలో 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం 191 నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉంది. 48 చోట్ల మాత్రమే ఎంజీబీ ముందుంది. ఇక 4 చోట్ల ఇతరులు ముందున్నారు.


