News August 19, 2024
1 నాటికి అన్ని శాఖలు వారి యాక్షన్ ప్లాన్ సమర్పించాలి: కలెక్టర్

సెప్టెంబర్ 1వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు వారి యాక్షన్ ప్లాన్ సమర్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి ఉపయోగపడే పనులను విజన్ డాక్యుమెంటరీలో రూపొందించాలని పేర్కొన్నారు. ప్రణాళికలు వేసేటప్పుడు ముఖ్య శాఖల మధ్య సమన్వయం ఉండాలని, గడువులోగా ఉపయుక్తమైన ప్రణాళికలు పంపాలని తెలిపారు.
Similar News
News December 15, 2025
పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం: కలెక్టర్ ఆనంద్

అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులని, ఆయన సేవలు చిరస్మరణీయమని, భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ కూడా పాల్గొన్నారు.
News December 15, 2025
మడకశిర సౌందర్యకు ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్’ రన్నరప్

మడకశిరకు చెందిన సోను సౌందర్య ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025’ పోటీలలో ఫస్ట్ రన్నరప్గా నిలిచి మడకశిర ఖ్యాతిని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు. విజయవాడలో జరిగిన ఈ పోటీలలో ఆమె సత్తా చాటారు. అక్టోబర్లో ‘శ్రీమతి విజయవాడ’ కిరీటాన్ని కూడా దక్కించుకున్న ఆమె, బ్యూటీషియన్గా కూడా రాణిస్తున్నారు. సౌందర్య సాధిస్తున్న విజయాలు నేటి గృహిణిలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
News December 15, 2025
అనంతపురం జిల్లా TDP నేత మృతి

అనంతపురం జిల్లా టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, రాయదుర్గం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి.లోకానంద సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాయదుర్గం పట్టణానికి చెందిన లోకానంద లీగల్ సెల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపై టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.


