News August 19, 2024
1 నాటికి అన్ని శాఖలు వారి యాక్షన్ ప్లాన్ సమర్పించాలి: కలెక్టర్
సెప్టెంబర్ 1వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు వారి యాక్షన్ ప్లాన్ సమర్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి ఉపయోగపడే పనులను విజన్ డాక్యుమెంటరీలో రూపొందించాలని పేర్కొన్నారు. ప్రణాళికలు వేసేటప్పుడు ముఖ్య శాఖల మధ్య సమన్వయం ఉండాలని, గడువులోగా ఉపయుక్తమైన ప్రణాళికలు పంపాలని తెలిపారు.
Similar News
News September 7, 2024
YSRCP ఆర్టీఐ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి
YSRCP ఆర్టీఐ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డిని నియమించారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పదవి అప్పగించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. కల్పలతా రెడ్డి తలుపుల మండలం నంగివాండ్లపల్లికి చెందిన వారు.
News September 7, 2024
వికసిత్ ఆంధ్ర 2047 కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్
పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో వికసిత్ ఆంధ్ర 2047కు సంబంధించి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని ప్రాథమిక రంగాల్లో అభివృద్ధికి 100 రోజులు, సంవత్సర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ విజయకుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News September 6, 2024
అనంత: ‘అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు’
బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూరుకు చెందిన రాజప్ప(32) ఈనెల 4న అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని పొలాల్లో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ నబీ రసూల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజప్ప ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర ఏదైనా కారణం వల్ల మృతి చెందాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు.