News March 25, 2025
AP EAPCETకు 1.12లక్షల దరఖాస్తులు

ఏపీ ఈఏపీసెట్కు ఇప్పటివరకు 1,12,606 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 15న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 24 వరకు కొనసాగనుంది. అపరాధ రుసుముతో మే 16 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
Similar News
News November 29, 2025
నవంబర్ 29: చరిత్రలో ఈ రోజు

1759: గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నౌలీ మరణం
1877: తొలిసారిగా థామస్ ఆల్వా ఎడిసన్ ఫోనోగ్రాఫ్ ప్రదర్శన
1901: చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం
1982: నటి, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య జననం
1993: పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా మరణం(ఫొటోలో)
2009: తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
News November 29, 2025
GDP వృద్ధి.. దేశ పౌరులందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త: CBN

2025-26 రెండో త్రైమాసికంలో దేశ GDP 8.2% వృద్ధి చెందడం ప్రతి పౌరుడికి ఉత్సాహాన్నిచ్చే వార్త అని CM CBN అన్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలిపిందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్యాల వైపు స్థిరంగా కొనసాగుతోందన్నారు. తాజా వృద్ధి తయారీ, నిర్మాణం, ఆర్థిక సేవలు తదితర రంగాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
News November 29, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


