News March 28, 2025
మిడ్ డే మీల్‌కు 1.14L టన్నుల సన్న బియ్యం: నాదెండ్ల

AP: ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సివిల్ సప్లైస్ 227వ బోర్డ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో 5.61L మంది రైతుల నుంచి 35.48L టన్నులను కొని, వారి ఖాతాల్లో రూ.8,138Cr జమ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి 1.14L టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేశామన్నారు. ప్రైవేటు గిడ్డంగులను గ్రీన్‌హౌస్ గిడ్డంగులుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం!

ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‍లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.
News September 18, 2025
తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,41,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.