News February 5, 2025

1.20లక్షల మందికి సూర్యనారాయణ స్వామి దర్శనం

image

అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా అధికారుల ప్రోద్భలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని కొనియాడారు. ఈఏడాది సూర్యనారాయణ స్వామిని 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.

Similar News

News December 17, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤SKLM: ఆర్టీసీ కార్గో ద్వారా నేరుగా ఇళ్లకు పార్సిల్స్
➤సరుబుజ్జిలి: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
➤మహిళల ఆర్ధిక ఎదుగుదల ముఖ్యం: ఎమ్మెల్యే కూన
➤ఉపాధి హామీ పేరు మార్పు అన్యాయం: మాజీ కేంద్ర మంత్రి కిల్లి
➤ పలాసలో వివాదాలకు కారణం అవుతున్న ప్రభుత్వ భూములు
➤టెక్కలి: పెద్దసానలో కొండచిలువ కలకలం
➤ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

News December 17, 2025

శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా రమేష్ ?

image

శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇతను మొదటి నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నారు. దీనిపై త్వరలోనే అధిష్టానం నుంచి ఉత్తర్వులు రానున్న అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ని 26 జిల్లాలకు కొత్త టీడీపీ అధ్యక్షుల పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి.

News December 17, 2025

ఎచ్చెర్ల: ‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన’

image

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని AP మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం ఎచ్చెర్లలోని ట్రిపుల్ ఐటీని ఆమె సందర్శించారు. మహిళా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పిల్లల రక్షణకు కూడా పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు.