News June 19, 2024
రైల్వే భద్రతా విభాగంలో 1.5లక్షల పోస్టులు ఖాళీ

రైల్వే భద్రతా విభాగంలో మంజూరైన పది లక్షల పోస్టులకు గాను 1.5లక్షలకు పైగా ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ తెలిపింది. RTI దరఖాస్తుకు ఈ మేరకు సమాధానమిచ్చింది. ఇందులో లోకో పైలట్ 14,429, అసిస్టెంట్ డ్రైవర్ 4,337 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపింది. అలాగే రైల్వే భద్రతా ప్రాజెక్టుల కోసం 2004-14 మధ్య కాలంలో రూ.70 వేల కోట్లు, 2014-24 సంవత్సరాల్లో రూ.1.78 లక్షల కోట్లు వెచ్చించినట్లు ఓ అధికారి చెప్పారు.
Similar News
News December 17, 2025
ధోనీకి ఇదే చివరి IPL: ఊతప్ప

రానున్న IPL సీజనే ధోనీకి చివరిదని CSK మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నారు. ఆపై ఎడిషన్లో ఆడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే అదే అర్థమవుతోందన్నారు. ‘గతేడాది, తాజాగా జరిగిన మినీ వేలంలోనూ యంగ్ క్రికెటర్లపై CSK ఎక్కువగా ఖర్చు చేసింది. అలాగే రుతురాజ్, శాంసన్ వంటి సారథులు జట్టులో ఉన్నారు. ఈ క్రమంలో ధోనీ టీం నుంచి తప్పుకొని మెంటార్గా కొనసాగే అవకాశాలున్నాయి’ అని చెప్పారు.
News December 17, 2025
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

AP: రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో బుధవారం 10AMకు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా 2 రోజుల కాన్ఫరెన్స్ జరగనుంది. తొలి రోజు 18నెలల పాలనపై సమీక్ష చేసుకొని కలెక్టర్లకు CM దిశానిర్దేశం చేయనున్నారు. 2వ రోజు జిల్లాల్లో ఉత్తమ పద్ధతులు అవలంభించిన కలెక్టర్ల ప్రజెంటేషన్లు, తదితర ప్రోగ్రాంలు ఉండనున్నాయి.
News December 17, 2025
పృథ్వీ షా SAD పోస్ట్.. అంతలోనే!

IPL మినీ వేలంలో తొలిసారి పృథ్వీ షా పేరు రాగానే కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన it’s ok అని హార్ట్ బ్రేక్ సింబల్ను ఇన్స్టా స్టోరీగా పెట్టారు. కాసేపటికే 2వ రౌండ్లో DC రూ.75 లక్షలకు కొనుగోలు చేయగా దాన్ని డిలీట్ చేసి ‘BACK TO MY FAMILY’ అని పోస్ట్ చేశారు. గతంలో 7 సీజన్లు DCకి ఆడిన షా 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. 2025 మెగా వేలం ముందు DC ఆయన్ను వదులుకోగా ఏ జట్టూ కొనలేదు.


