News July 27, 2024
తెలంగాణలో 1.65 కోట్ల వాహనాలు

తెలంగాణలో ఈ ఏడాది మే నాటికి 1,65,65,130 వాహనాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోషియో ఎకనమిక్ ఔట్లుక్ నివేదికను విడుదల చేసింది. గతేడాది ఇదే సమయానికి 1.54 కోట్ల వాహనాలు ఉంటే.. ఏడాది కాలంలోనే ఏకంగా 10.88 లక్షల వెహికల్స్ రోడ్లపైకి చేరాయని తెలిపింది. మొత్తం 1.65 కోట్ల వాహనాల్లో అత్యధికంగా 1,21,74,353 బైకులు ఉన్నాయని వివరించింది.
Similar News
News December 5, 2025
జగిత్యాల: అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక రైలు

జగిత్యాల జిల్లాలోని అయ్యప్ప స్వాములకు ప్రయాణం సులభతరం కానుంది. నాందేడ్ నుంచి వయా జగిత్యాల మీదుగా శబరిమలకి ప్రత్యేక రైలు నడపాలని కాంగ్రెస్ సేవాదళ్ సెక్రటరీ ముకేశ్ ఖన్నా చేసిన విన్నపంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించారు. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి.. దీక్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని DEC 24, జనవరి 7 తేదీల్లో ప్రత్యేక రైలు నడిచేలా అధికారులు రైలు ఏర్పాటు చేశారు.
News December 5, 2025
TG న్యూస్ రౌండప్

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.


