News January 27, 2025

ఒక్కరోజే 1.74 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం

image

యూపీ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 1.74 కోట్ల మందికిపైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో స్నానమాచరించిన వారి సంఖ్య 13.21 కోట్లు దాటింది. ఈ నెల 29న మౌని అమవాస్య రోజున భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే.

Similar News

News March 14, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 14, 2025

బోరుగడ్డకు 14 రోజుల రిమాండ్

image

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు కోర్టు రిమాండ్ విధించింది. జైలులో లొంగిపోయిన ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలపూడి పీఎస్‌లో నమోదైన కేసుల్లో అనిల్‌కు ఈ నెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

News March 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 14, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.25 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!